ఫిబ్రవరి 3 ( సిరి న్యూస్ )
సంగారెడ్డి.[sangareddy]
వసంత పంచమి సందర్బంగా సంగారెడ్డి పట్టణం లోని సరస్వతి నగర్ శ్రీ విద్యా సరస్వతి మాతా దేవాలయం లో వైభవం గా జరిగిన వసంత పంచమి వేడుకలు ఈ సందర్బంగా ఆలయ అర్చకులు మీనా నాథ్ శర్మ ఆధ్వర్యంలో అమ్మ వారికీ కుంభభిషేకం, మంగళ హరతులు, కుంకుమర్చనలు, సామూహిక అక్షరాభ్యాస లు, నిర్వహించారు. ఇట్టి కార్యక్రమం లో సంగారెడ్డి పరిసరాల భక్తులు భారీగా పాల్గొన్నారు ఈ సందర్బంగా ఆలయానికి వచ్చిన భక్తులకు ఆలయ లో తీర్ద ప్రసాదం వితరణ చేశారు. ఈ సందర్బంగా ఆలయ వ్యవస్థ పాక అధ్యక్షులు కోడిదే లింగమ్మ యాదగిరి ఆధ్వర్యంలో ఆలయానికి వచ్చే భక్తులకు గత ఇరవై ఏండ్లుగా దర్శన ఏర్పాట్లు చేస్తున్నారు. నేటి కార్యక్రమం లో నిర్వాహకులు గా ఆలయ కమిటీ సభ్యులు కాలనీ వాసులు శ్రీధర్ మహేంద్ర, వినయ్, తాండ్ర రాజు, కుమార్, ప్రమోద్, బాబన్న, మారుతీ, సుమన్, సాయి,జయం యూత్ సభ్యులు సుభాష్, పవన్, హన్మంత్,మహిళా కమిటీ సభ్యులు శ్రీనిత దేవి, సంతోషి, జ్యోతి, తదితరులు పాల్గొన్నారు