ఇటుక బట్టిలో విద్యార్థులకు అవగాహన ర్యాలీ
మండల యువజన సంఘాల సమితి ఆధ్వర్యంలో ఘనంగా జాతీయ బాలికల దినోత్సవం
గుమ్మడిదల[Gummadidala]సిరి న్యూస్ రూరల్
గుమ్మడిదల మండలం అన్నారం గ్రామ పరిధిలో జాతీయ బాలిక దినోత్సవాన్ని పురస్కరించుకొని మండల యువజన సంఘాల సమితి ఆధ్వర్యంలో ఇటుక బట్టీలలో విద్యార్థులకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సంఘం నాయకులు బాలికల విద్యా ప్రాధాన్యతను గురించి వివరించారు.
యువజన సంఘాల నాయకులు మాట్లాడుతూ.. “బాలికలు బాగా చదివి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని అన్నారు. వారి అభివృద్ధి సమాజ అభివృద్ధి అని గుర్తించి అందరూ మద్దతుగా ఉండాలి” అని నాయకులు కోరారు. విద్యే మాత్రమే జీవనంలో మార్గదర్శకంగా నిలుస్తుందని, విద్య ద్వారా బాలికలు తమకున్న సామర్థ్యాలను గుర్తించి విజయాలు సాధించాలని పిలుపునిచ్చారు. బాలికల హక్కులు, సమాన అవకాశాలు, విద్యా ప్రాముఖ్యత గురించి అవగాహనను వివరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు మద్ది ప్రతాప్ రెడ్డి, యువజన సంఘం నాయకులు వడ్డే ఎల్లయ్య, మంద భాస్కర్ రెడ్డి, చెన్నం శెట్టి ఉదయ్ కుమార్, హెచ్ఎం రతన్ కిషోర్, సి.ఆర్.పి మురళి, ఐదే ఎట్ అక్షన్ ఆర్గనైజేషన్ వారి విద్యా వాలంటీర్లు నాయక్ దుర్యోధన్, జన చైతన్య కళా సమస్త కళాకారులు రొయ్యపల్లి రవి, జీవన్ కుమార్, సంగం సభ్యులు నవీన్ సాగర్, విష్ణువర్ధన్ ప్రసాద్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.