హామీలపై వినూత్నంగా నిరసన కార్యక్రమం చేపట్టినా బిఆర్ఎస్ నాయకులు..
సిరిహత్నూర : తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 420 రోజులు గడిచిన ఏ ఒక్క హామీని అమలు చేయలేదని ఆరోపణలు చేస్తూ హత్నూర మండలంలోని దౌల్తాబాద్ నస్తీపూర్ లింగాపూర్ తదితర గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు వినూత్నంగా నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందజేసి మాట్లాడారు. బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుమేరకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిందని అన్నారు.
ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చాక నెరవేరుస్తామని ప్రజలను మభ్యపెట్టారు. ఇచ్చిన హామీలు తులం బంగారం 4000 పెన్షన్ రైతు భరోసా అనేక హామీలు విస్మరించిందని మండిపడ్డారు. ఇచ్చిన హామీలు ఆరు గ్యారంటీలు అమలు చేయాలని ప్రశ్నిస్తే ప్రశ్నించిన గొంతుకులపై ఉక్కు పాదం మోపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలని ప్రజల తరఫున టిఆర్ఎస్ పార్టీ ఎల్లవేళలా పోరాటం చేస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ యువజన నాయకులు తుమ్మలపల్లి కిషోర్, లక్ష్మణ్ గౌడ్, అజ్మత్ అలీ,మణిదీప్,శేఖర్ గౌడ్, మల్లేశం,రాజు కిషన్ గౌడ్,యాదయ్య, నవీన్, ప్రశాంత్,హైమత్ తదితరులు పాల్గొన్నారు.