నారాయణఖేడ్[Narayankhed], జనవరి 12 )సిరి న్యూస్)
నారాయణఖేడ్ పట్టణంలో ఓం శాంతి క్యాలెండరు జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ..వ్యక్తులను సన్మార్గంలో నడిపించడానికి బ్రహ్మకుమారి ట్రస్ట్ ఎంతగానో కృషి చేస్తుందన్నారు. మానవ జీవితానికి విలువలు పెంచడానికి నిరంతరం కృషి చేస్తున్న సంస్థ ఓం శాంతి అన్నారు. మానవులకు భక్తి మార్గంతోనే ముక్తి లభిస్తుంది అన్నారు. శాంతి ఎక్కడుంటే అక్కడ పవిత్రత ఉంటుందన్నారు.
ఈ కార్యక్రమంలో పీసీసీ సభ్యులు శంకరాయ్యస్వామి,ఓం శాంతి లక్ష్మీ అక్క,పరమేశ్వర్ ముదిరాజ్, మల్లికార్జున్ పాటిల్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు, సంగమేశ్వర్ పాటిల్ మనూర్ మండల యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు, రాజశేఖర్, సర్దార్ నాయక్,తదితరులు పాల్గొన్నారు.