పాత పెన్షన్ కై.. పి ఆర్ టి యు టి ఎస్ పోరుబాట.

old pension ky.. p r t u t s struggle.
old pension ky.. p r t u t s struggle.

నారాయణఖేడ్[Narayankhed]: జనవరి 27 (సిరి న్యూస్)
కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 1వ తేదీ నుండి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు యునైటెడ్ పెన్షన్స్ స్కీమ్ అమలు చేయాలని నిర్ణయాన్ని పి ఆర్ టి యు టి ఎస్ దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది.
యునైటెడ్ పెన్షన్ స్కీమ్ కు వ్యతిరేకంగా నేడు అన్ని మండల కేంద్రాలలో యునైటెడ్ స్కీమ్ ను వ్యతిరేకిస్తూ మండల తహసిల్దారులకు వినతి పత్రం సమర్పించాలని రాష్ట్ర శాఖ నిర్ణయించిన మేరకు ఈరోజు నారాయణఖేడ్ రెవెన్యూ డివిజనల్ అధికారికి యునైటెడ్ పెన్షన్ స్కీంను రద్దుపరిచి ఓల్డ్ పెన్షన్ పునరుద్ధరించాలని నారాయణఖేడ్, పి ఆర్ టి యు టి ఎస్ అర్బన్ మరియు రూరల్ శాఖల ఆధ్వర్యంలో మెమోరాండం సమర్పించనైనది.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎక్కం పాండురంగారెడ్డి, మాట్లాడుతూ ఎలాంటి రక్షణ లేని యునైటెడ్ పెన్షన్ స్కీమ్ ను కేంద్రం అమలు పరుస్తూ రాష్ట్రాలు కూడా అమలు చేయాలని ఒత్తిడి తీసుకువచ్చే అవకాశం ఉంది. అనేక షరతులతో కూడిన యునైటెడ్ పెన్షన్ స్కీమ్ ను వ్యతిరేకిస్తున్నట్లు తెలియజేశారు. ఒక ఉద్యోగి 30 సంవత్సరాలు తమ కుటుంబాలను త్యాగం చేసి రాష్ట్ర అభివృద్ధిలో పాలు పంచుకుంటే ఆర్థికపరంగా ఎలాంటి రక్షణ లేకపోవడం దురదృష్టకరమని తెలియజేశారు. తాము జమ చేసుకున్న డబ్బులను షేర్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేయడం మూలంగా అప్పటి పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు. ఇలాంటి పెన్షన్ను అమలు చేయడం వలన పదవీ విరమణ చేసిన ఉద్యోగికి వృద్ధాప్యంలో ఎలాంటి రక్షణ లేకుండా పోతుందని ఓల్డ్ పెన్షన్స్ కి వచ్చే వరకు పి ఆర్ టి యు టి ఎస్ విశ్రమించదని తెలియజేశారు.