జనవరి 11 ( సిరి న్యూస్ )
సంగారెడ్డి.[sangareddy]
జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బ్రిటిష్ వారి నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన మహనీయ స్వాతంత్ర్య సమరయోధుడు ఒడ్డె ఓబన్న జయంతి వేడుకలు శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరం లోఘనంగానిర్వహించారు.ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు ముఖ్య అతిధి గా హాజరై ఒడ్డె ఓబన్న చిత్ర పటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించి ,ఆయన సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ క్రాంతి వల్లూరు మాట్లాడుతూ అందరికీ స్వేచ్ఛ, సమానత్వం, గౌరవం కల్పించాలనే ఆశయంతో పోరాడిన స్వాతంత్య్ర సమరయోధుడు ఒడ్డె ఓబన్న అని అన్నారు. స్వాతంత్య్ర సంగ్రామంలో ఒడ్డె ఓబన్న పాత్ర అత్యంత ప్రభావవంతమైందని గుర్తుచేశారు. నిరంకుశ బ్రిటిష్ పాలనను ఎదిరించి తన ప్రజల హక్కుల కోసం ఆత్మవిశ్వాసంతో పోరాడిన ఓబన్న వంటి నాయకుల జీవితం ప్రతి ఒక్కరికీ ఒక గొప్ప ప్రేరణ అని ఆమె అన్నారు. తన సామాజిక వర్గాన్ని గుర్తించి, వారికి గౌరవం తీసుకురావడానికి ఆయన కృషి చేశారని పేర్కొన్నారు. ఆయన జీవితం నుంచి అందరూ స్ఫూర్తి పొందాల్సిన అవసరం ఉందన్నారు . బలహీనవర్గాల హక్కుల కోసం ఆయన చేసిన కృషి గురించి యువతకు అవగాహన కల్పించాలని అన్నారు. విద్యార్థులకు ఒడ్డె ఓబన్న వంటి త్యాగధనుల త్యాగాలను తెలుసుకొని, దేశసేవకు అంకితమవ్వాలని పేర్కొన్నారు .బడుగు, బలహీనవర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, విద్య, ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలను కల్పించడంలో కృషి చేస్తుందని కలెక్టర్ తెలిపారు .
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్,సహాయ బి సి సంక్షేమాధికారి కె . భాగ్యలక్ష్మి , జిల్లా వడ్డెర సంఘం అధ్యక్షులు వరికుప్పల లింగయ్య , సంఘం నాయకులు పల్లపుఅంజయ్య , వి ఏం ఎల్ చక్రవర్తి ,శ్రీనివాస్ , జైరాం ,ఆంజనేయులు ,వివిధ సంఘాలనాయకులు , సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.