ఫిబ్రవరి 3 ( సిరి న్యూస్ )
సంగారెడ్డి.[sangareddy]
పీసీసీ అద్యేక్షులు మహేష్ కుమార్ గౌడ్ ,ఆదేశాల మేరకు ఈ రోజు సంగారెడ్డి లో అంబెడ్కర్ విగ్రహం వద్ద జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు టి జి ఐ ఐ సి చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి అధ్యక్షతన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ దిష్టిబొమ్మ దహనం హెయ్యడం జరిగింది .ఈ సందర్భంగా నారాయణఖేడ్ ఎమ్మెల్యే ,సంజీవరెడ్డి మాట్లాడుతూ కేంద్రం మన రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసిందని అన్నారు లక్షల రూపంలో పన్నులు కడుతున్న మనకు మంత్రం గుండు సున్నా ఇచ్చింది అన్నారు విభజన హామీలను కూడా తుంగలో తొక్కిందన్నారు నిర్మలా జగ్గారెడ్డి గారు మాట్లాడుతూ రాష్ట్రం నుండి 8 మంది ఎంపీలు అందులో ఇద్దరు కేంద్ర మంత్రులు కానీ తెలంగాణా కు మాత్రం కొత్తగా ఒక్క ప్రాజెక్ట్ ఒక్క రూపాయి కూడా తెచ్చే దమ్ము లేదు అన్నారు తెలంగాణ ప్రజలకు బీజేపీ క్షమాపణ చెప్పాలని అన్నారు ఈ కార్యక్రమంలో టీపీసీసీ కార్యదర్శి ఆంజనేయులు బ్లాక్ కాంగ్రెస్ అద్యేక్షులు రఘు గౌడ్ సీడీసీ చైర్మన్ రాంరెడ్డి, ఆత్మకమిట ఛైర్మెన్ ప్రభు సంగారెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ రామచందర్ నాయక్ సదాశివపేట మార్కెట్ కమిటీ చైర్మన్ సడకుల కుమార్, సదాశివపేట పట్టణ అద్యేక్షులు మునిపల్లి సత్య నారాయణ కంది మండల అద్యేక్షులు మోతి లాల్ నాయక్ నాయకులు బొంగుల రవి,కిరణ్ గౌడ్,కూన సంతోష్, షఫీ, మహేష్,కసిని రాజు,తహెర్ పాషా,అరిఫ్,అర్జున్, నరేన్, చిత్తరి యాదగిరి,సునీల్ రాజంపేట శ్రీను,కుతుబ్, జహీర్, తదితరులు పాల్గొన్నారు..
Home జిల్లా వార్తలు కేంద్ర ప్రభుత్వ విధానాలకు నిరసనగా నరేంద్ర మోడీ దిష్టిబొమ్మ దగ్ధం చేసిన నిర్మల జగ్గారెడ్డి.