సిరి న్యూస్ – గుమ్మడిదల[gummadidala]
మండల కేంద్రమైన గుమ్మడిదల లో యువజన వారోత్సవాల ముగింపు సందర్భంగా గురువారం సుభాష్ చంద్రబోస్ జయంతిని ఘనంగా నిర్వహించారు. మండల యువజన సంఘాల సమితి ఆధ్వర్యంలో ఆయన విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కొనసాగిద్దాం కొనసాగిద్దాం నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆశయాలను కొనసాగిస్తాం అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా యువజన సంఘాల ప్రతినిధి మంద భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ నేటి యువత సుభాష్ చంద్రబోస్ అడుగుజాడల్లో నడవాలని ఆయన ఆశయాలు నెరవేర్చి దిశగా యువజన సంఘాల సభ్యులు స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు సామాజిక సేవా కార్యక్రమాలపై నిరంతరం పనిచేయాలని కోరారు గ్రామీణ స్థాయి పేద బీద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అధికారులకు ప్రజలకు వారధిగా యువజన సంఘాల సభ్యులు ఉండి సామాజిక సేవా కార్యక్రమాలలో స్ఫూర్తిదాయకంగా నిలవాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో సి జి ఆర్ ట్రస్ట్ చైర్మన్ గోవర్ధన్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి కుమార్ గౌడ్, మాజీ సర్పంచ్ చిమ్ముల నరసింహారెడ్డి, యువజన సంఘాల సభ్యులు చెన్నంశెట్టి ఉదయ్ కుమార్, వి ఎ ఎల్లయ్య, వర్తక సంగం అధ్యక్షులు ఆకుల సత్యనారాయణ, ప్రవీణ్ రెడ్డి, పొన్నాల శ్రీనివాస్ రెడ్డి, రవి కాంత్ రెడ్డి, సంజీవ రెడ్డి, దాసరి ఆంజనేయులు, టీవీ రాంరెడ్డి, కర్ణాకర్ గౌడ్, సూర్యనారాయణ, నల్తూరు యాదగిరి అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు