ఫలితంగా ఎండుతున్న పంట పొలాలు..
డిడి కట్టి సంవత్సరాలు గడిచిన పట్టించుకోని సంబంధిత అధికారులు..
న్యాయం చేయాలని కోరుతున్న బాధితుడు..
రామాయంపేట[ramayampet] జనవరి 24 (సిరి న్యూస్)
తమకు విద్యుత్ కనక్షన్ కావాలని రామంపేట విద్యుత్ శాఖ అధికారులకు డిడి కట్టి సంవత్సరాలు గడిచిన ఇప్పటివరకు లైన్ కలపడం లేదని బాధిత రైతు ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన ఓ రైతు తన వ్యవసాయ పొలం వద్దకు విద్యుత్ కనెక్షన్ కావాలని గత మూడున్నర సమస్యల క్రితం విద్యుత్ అధికారులకు డిడి కట్టడం జరిగిందని రైతు తెలిపారు. అయితే ఇప్పటివరకు సంబంధిత అధికారులు తనకు ఇలాంటి కనెక్షన్ ఇవ్వకపోవడంతో పాటు, అధికారులు మారుతున్నారు తప్ప తనకు సరైన సమాధానం చెప్పకపోవడంతో పాటు న్యాయం జరగడం లేదని రైతు బోరున విలపించడం జరిగింది. సమస్యల క్రితం డిడి కట్టినప్పటికీ ఇప్పటివరకు సమస్య పరిష్కారం కాకపోవడంతో అప్పటినుండి తన భూమిని సరైన విధంగా సాగు చేయలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. ప్రస్తుతం వరి నారు వేసినప్పటికీ విద్యుత్ కనెక్షన్ లేకపోవడం వల్ల నీళ్లు లేక ఎండిపోయే దశకు వస్తుందని ఆవేదన చెందడం జరుగుతుంది. తనకున్న రెండు బోర్లలో ఒకదానికి డిడి కట్టినప్పటికీ దానికి సైతం కనెక్షన్ ఇవ్వడంలేదని అన్నారు. ఈ విషయంలో సంబంధిత కార్యాలయం చుట్టూ తిరిగి తిరిగి బోరున విలపించడం జరుగుతుంది. పేద స్థితిలో ఉన్న తనకు అధికారులు ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అర్థం కావడం లేదని రైతు ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది.