పటాన్‌చెరు : నూతన సంవత్సరం సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నీలం మధు శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లోని సీఎం నివాసంలో మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. మెదక్ పార్లమెంట్ పరిధిలో సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను గ్రామస్థాయికి తీసుకెళ్లాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.
అర్అర్ఆర్, మూసీ నది ప్రక్షాళన వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు చేపట్టి ప్రజలకు ఎంతో ఉపయోగపడే విధంగా అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తున్న రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి మనందరం ఎల్లవేళలా అండగా ఉంటూ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆయన ఆకాంక్షించారు. కాంగ్రెస్ పాలన అంటే ప్రజాపాలనకు నిలువెత్తు నిదర్శనమని తెలిపారు.