రామాయంపేట[ramayampet] జనవరి 25 (సిరి న్యూస్)
మెదక్ జిల్లా[medak] రామాయంపేట మండల కేంద్రంలో 15వ జాతీయ ఓటర్ దినోత్సవం ఘనంగా నిర్వహించారు.ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద ర్యాలీని మండల తహసిల్దార్ రజినీకుమారి ప్రారంభించారు.అక్కడ నుండి మొదలైన ఓటర్ దినోత్సవం ర్యాలీ బస్టాండ్ ప్రధాన రహదారి గుండా సిద్దిపేట చౌరస్తా వరకు నిర్వహించారు.అక్కడ అధికారులు మానవహారం నిర్వహించి,పాఠశాల విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు.ఈ సందర్భంగా మండల తహసిల్దార్ రజనీకుమారి మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన ప్రతి పౌరుడు తమ ఓటరుగా నమోదు చేసుకోవాలని విధిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఓటు ఎంతో విలువైనదని అన్నారు.ప్రతి సంవత్సరం జనవరి 25న జాతీయ ఓటర్ దినోత్సవం నిర్వహించడం జరుగుతుందని నేడు ర్యాలీ నిర్వహించి ఓటు హక్కు పై అవగాహన కలిగే విధంగా ర్యాలీ కొనసాగించడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక తహసిల్దార్ రజనీకుమారి,మున్సిపల్ కమిషనర్ ఎం.దేవేందర్,ఆర్ఐ.గౌసోద్దీన్,గోపి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ హిమజ్యోతి,ఏఎస్ఐ రవీందర్ రెడ్డి మండల సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు.