నారాయణఖేడ్[ Narayankhed]: జనవరి 30 (సిరి న్యూస్)
ఖెడ్, జంట గ్రామమైన మంగళ్ పెట్ ఆర్టీసీ బస్ డిపో లో గురువారం నాడు, జాతీయ రోడ్డు మహోత్సవాలు కార్యక్రమంలో పాల్గొన్న నారాయణఖేడ్ ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవ రెడ్డి.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికులకు కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని ఎమ్మెల్యే అన్నారు. ఆర్టీసీ డ్రైవర్లు బస్సులను జాగ్రత్తగా నడపాలని, బస్సులో 50 మంది ప్రాణాలు డ్రైవర్ చేతిలో ఉంటాయని దాన్ని దృష్టిలో పెట్టుకొని డ్రైవర్లు బస్సులు జాగ్రత్తగా నడపాలన్నారు. ఒకప్పుడు నారాయణఖేడ్ కు రెండే బస్సులు వచ్చేవని ఇప్పుడు నారాయణఖేడ్ లోనే బస్సు డిపో కావడం గర్వంగా ఉందన్నారు. ఈ డిపోకు 27 బస్సులు కావాలని ప్రతిపాదనలు మంత్రికి ఇవ్వడం జరిగిందని ఆయన అన్నారు. త్వరలోనే ఆ బస్సులు మన ఆర్టీసీ డిపోకు వస్తాయని అన్నారు. ఒకప్పుడు ఏ వాహనము ఉండేది కాదని ప్రజలందరూ ఆర్టీసీ బస్సుల్లోనే తిరిగే వారిని ఇప్పుడు ప్రస్తుతం ప్రైవేట్ వాహనాలు పెరిగాయని ఆయన అన్నారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం ప్రజలకు ఎంతో సురక్షితంగా సౌకర్యవంతంగా ఉంటుందని ఎమ్మెల్యే అన్నారు.
ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు సమయపాలన పాటించి నారాయణఖే డిపోకు మంచి పేరు తీసుకురావాలని ఆయన కోరారు.
డిపో మేనేజర్ మల్లేశం, మాట్లాడుతూ నారాయణఖేడ్ డిపోకు డ్రైవర్లు కండక్టర్లు తక్కువగా ఉన్నారని కొత్త రిక్రూట్మెంట్ చేసి నారాయణఖేడ్ డిపోకు కేటాయించాలని ఎమ్మెల్యేకు కోరారు. ఆ తర్వాత కార్మికులు మాట్లాడుతూ చాలీచాలని జీతంతో నెట్టుకు వస్తున్నామని మాకు తెల్ల రేషన్ కార్డులు ఇంటి స్థలాలకు జాగా ఇవ్వాలని ఎమ్మెల్యేకు కోరారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ దారం శంకర్ సెట్,రమేష్ చౌహాన్, పాండు, ఆర్టీసీ కండక్టర్లు, డ్రైవర్లు,తదితరులు పాల్గొన్నారు.