ఉత్తర ద్వారంలో రామయ్య దర్శనం తిలకించి భక్తులతో రామనామ స్మరణలతో మారు మోగిన ఆలయాలు
సిరి ,చేగుంట ,10
మెదక్ జిల్లా చేగుంట పట్టణ కేంద్రం లో ఉన్నటువంటి శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో శుక్రవారం ముక్కోటి ఏకాదశి సందర్భంగా రామయ్య ఉత్తర ద్వారం ద్వారా భక్తులకు దర్శనం ఇవ్వగా,ఆ సుందర దృశ్యాన్ని తిలకించి పులకించిన భక్తజనులు, అనంతరం ఆలయంలో
జై శ్రీరామ్… జై జై శ్రీరామ్ అంటూ జయ జయధ్వానాలు చేశారు. ఈ సందర్భంగా వేదపండితులు ముక్కోటి విశిష్టతను హాజరైన భక్తులకు వివరించారు,
ఈ సందర్భంగా ఉత్సవాలు నిర్వహణలో సహకరించిన భక్తులకు,ధాతలకు,పాత్రికేయులకు ఆలయ కమిటీ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.