వెల్దుర్తి మండల కేంద్రంలో వైభవంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు

Mukkoti Ekadashi celebrations in Veldurthi mandal center
Mukkoti Ekadashi celebrations in Veldurthi mandal center

వెల్దుర్తి (సిరి న్యూస్ జనవరి 10 )
వెల్దుర్తి మండల కేంద్రంలో గల శ్రీ వెంకటేశ్వర ఆలయంలో ఉత్తర ద్వారంలో శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించి భక్తులు గోవింద నామ స్మరణలతో మార్మోగిన దేవాలయం
వెల్దుర్తి పట్టణ కేంద్రంలో గల శ్రీ వెంకటేశ్వర దేవాలయంలో శుక్రవారం రోజున ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని వెల్దుర్తి గ్రామ ప్రజలు అంగరంగ వైభవంగా ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకుని స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలు మరియు గోవింద నామాలతో స్మరణాలు చేస్తూ భక్తజనం అంతా భక్తిలో పులికించి పోయారు ఆలయ పూజారి గిరీశ్వర్ శర్మ ఆధ్వర్యంలో ముక్కోటి ఏకాదశి విశిష్టత గ్రామ ప్రజలు మరియు భక్తులకు తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో జగ్గా అశోక్ గౌడ్ కొమిరి శెట్టి సురేష్ కైలాస్ సంతోష్ కుమార్ కొమిరిశెట్టి రమేష్చంద్రగుప్త భైరవదాసు నంబూద్రి గుప్తా మరియు గ్రామ ప్రజలు భక్తులు పాల్గొన్నారు