పెద్ద శంకరంపేట, (సిరి న్యూస్):
పెద్ద శంకరంపేట [pedda shankarampet] లోని శ్రీ సరస్వతి శిశు మందిర్ లో శనివారం నిర్వహించిన ముగ్గుల పోటీలు అందరిని ఎంతగానో అలరించాయి. శిశు మందిర్ విద్యార్థులు వివిధ రంగులతో రంగవల్లులను అందంగా అలంకరించారు. గెలుపొందిన విద్యార్థులకు పేట మాజీ ఎంపీపీ జంగం శ్రీనివాస్, పాఠశాల అధ్యక్షులు దాదిగారి గంగాధర్, జంగం రాఘవులు, తదితరుల చేతుల మీదుగా బహుమతులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రబంధ కార్యని సభ్యులు క్రాంతి లాల్, పున్నయ్య, ప్రధానాచార్యులు వీరప్ప జైహింద్ రెడ్డి, సీతారామారావు, సతీష్ గౌడ్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.