ముదిరాజ్ ప్రజా చైతన్య బస్ యాత్ర”

Mudiraj Praja Chaitanya Bus Yatra”
Mudiraj Praja Chaitanya Bus Yatra”

నారాయణఖేడ్[Narayankhed]; జనవరి 27 (సిరి న్యూస్)
బస్సు యాత్రలో భాగంగా 9వ రోజు ఆదివారం ఉదయం నారాయణఖేడ్, పట్టణానికి చేరుకోగానే స్థానిక ముదిరాజ్ పెద్దలు వారికి ఘన స్వాగతం పలికారు. మంగళ పేట్, లో ఉన్న ముద్రాజ్ భవన్లో శాలువా పూలమాలతో సత్కరించారు. ఆ తరువాత కృష్ణ సామి ముదిరాజ్ విగ్రహానికి పూలమాల వేసి వీడ్కోలు పలికారు. డా.శివ ముదిరాజ్ నేతృత్వంలో గత తొమ్మిది రోజులుగా చేస్తున్న ఈ బస్ యాత్ర ఆదివారం నారాయణఖేడ్ పట్టణానికి చేరుకుంది. ముదిరాజుల ప్రధాన డిమాండ్ల పై బస్సు యాత్ర. చేస్తున్న డాక్టర్ శివ, మాట్లాడుతూ ముదిరాజులను
BC -D నుంచి BC -A కు మార్చాలి కానీ ఆ పని ఏ ప్రభుత్వం చేయలేదన్నారు
ప్రస్తుతం జరుగుతున్న ఆర్థిక నష్టాలను,సామాజిక వెనకబాటు తనం రాజకీయ వెనకబాటు తనం గురించి మాట్లాడుతూ వాటిని రూపు మాపాలనే ఉద్దేశ్యంతో ఈ బస్సు యాత్ర చేస్తున్నామని దానికి ముదిరాజ్ యువత ముందుకు వచ్చి తోడ్పాటు అందించాలని డాక్టర్ శివ ముదిరాజ్ కోరారు. తెలంగాణలో 50 లక్షలకు పైన ఉన్న ముద్రాజులు ప్రతి గ్రామంలో హనుమాన్ మందిర్ ఎలా ఉంటుందో ప్రతి గ్రామంలో ముదిరాజులు అలా ఉంటారు. హనుమంతుడు లేని గ్రామం లేదు. ముదిరాజ్ లేని ఊరు లేదు ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహిస్తే నష్టపోయేది ముదిరాజులే కదా.. అని ఆయన అన్నారు. సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పిటిసిలు, ఎంపీపీలు, మున్సిపల్ కమిషనర్లు, అయ్యే అవకాశం ఉన్న మనవాళ్లు ముందుకు వచ్చిన రాజకీయ పార్టీలు మాత్రం మనల్ని వెనక్కి నెట్టి వేస్తున్నాయన్నారు. ఇప్పటికైనా ముదిరాజుల అందరము ఏకతాటిపైకి వచ్చి ముదిరాజులు అంటే ఏందో ఈ రాజకీయ పార్టీలకు చూయించే రోజులు దగ్గరనే ఉన్నాయని డాక్టర్ శివ ముదిరాజ్ అన్నారు. రాబోయే రోజుల్లో జెమిలి ఎన్నికలు రానున్నాయి. శాసనసభ పార్లమెంట్ సీట్లు పెరిగే అవకాశం ఉన్నందున అందులో ముదిరాజ్ బిడ్డలకు అవకాశం కల్పించాలని కోరుతున్నాం అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో నారాయణఖేడ్ నియోజకవర్గ ముదిరాజ్ అధ్యక్షులు ఆవుటి శంకర్, జిల్లా జనరల్ సెక్రెటరీ సత్యనారాయణ, నారాయణఖేడ్ మాజీ ఎంపీటీసీ సాయిలు పటేల్, రామకృష్ణ, మాజీ కౌన్సిలర్, మచ్చందర్ ముదిరాజ్, వెంకటాపూర్, శ్రీశైలం ముదిరాజ్, రామకృష్ణ సార్ ముదిరాజ్, మంగల్ పేట్,ముదిరాజ్ అధ్యక్షులు, తెలుకొండ రవి ముదిరాజ్, భవాని రవి ముదిరాజ్, బాల్రాజ్ ముదిరాజ్, పలువురు ముదిరాజ్ నాయకులు పాల్గొన్నారు.ఈ బస్ యాత్రలో బ్రహ్మం ముదిరాజ్ , సాయికిరణ్ ముదిరాజ్, మహేష్ బాబు ముదిరాజ్, దశరథం ముదిరాజ్, సైదులు ముదిరాజ్,శ్రీనివాస్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు..