ప్రభుత్వ పాఠశాల లో మాక్ పోలింగ్

Mock polling in government school
Mock polling in government school

ఎన్నికల సరళిని పరిశీలించిన జిల్లా విద్యాధికారి డాక్టర్ రాధా కిషన్
చేగుంట[chegunta] జనవరి 31,సిరి న్యూస్
మెదక్ జిల్లా చేగుంట మండల పరిదిలోని చందాయి పేట్ ప్రభుత్వ పాఠశాల లో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ కిషన్, ఉపాధ్యాయ బృందం ఆధ్వర్యంలో మాక్ పోలింగ్ నిర్వహించారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా విద్యాధికారి రాధాకృష్ణన్ హాజరయ్యారు, ముందుగా పాఠశాలలో ఉన్నటువంటి హాజరు పట్టికను, విద్యార్థులకు అందించే వంట సామాగ్రిలను మండల విద్యాధికారి నీరజ తో తనిఖీ చేశారు, అనంతరం పాఠశాలలు జరుగుతున్న వంటి మాక్ పోలింగ్ సరళిని, ఓటర్ అభ్యర్థి నుండి, ఏజెంట్, ప్రొసీడింగ్ ఆఫీసర్ వరకు నిర్వహించిన విద్యార్థులను, అభినందించి, జిల్లా విద్యాధికారికి తనకు కేటాయించిన బూత్ లో విద్యాధికారి ఓటు వేశారు ఈ కార్యక్రమం మండల విద్యాధికారి, నీరజ, డిప్యూటీ తాసిల్దార్ శ్రీకాంత్, ఎంపీడీవో చిన్న రెడ్డి, స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎం అమర్ సేన రెడ్డి, యూనియన్ నాయకులు, వెంకట్ రామ్ రెడ్డి, చల్ల లక్ష్మణ్, పాఠశాల ఉపాధ్యాయ బృందం, గ్రామ పంచాయతీ సెక్రటరీ రాధా తదితరులు పాల్గొన్నారు.