నారాయణఖేడ్,[Narayankhed] ; జనవరి 23 (సిరి న్యూస్)
పట్టణం జూకల్ శివారులోని మహాత్మ జ్యోతిబాపూలే స్కూల్లో గురువారం మాక్ పోలింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. జనవరి 25 జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకొని ముందస్తుగా స్టూడెంట్స్ లో లీడర్షిప్ క్వాలిటీస్ పెంచడానికి, ప్రజాస్వామ్యంలో ఓటు యొక్క ఆవశ్యకతను తెలియజేసేలా టీచర్లు స్టూడెంట్స్ ఎంకరేజ్ చేశారు. మాక్ పోలింగ్ ఎలక్షన్లలో భాగంగా ఒక సర్పంచ్, ఐదు వార్డులకు ఎన్నికలు నిర్వహించగా స్టూడెంట్స్ సర్పంచుకు వార్డు కౌన్సిలర్లకు నామినేషన్ దాఖలు చేశారు. మాక్ పోలింగ్ కార్యక్రమాన్ని ఏటిపి ప్రతిభ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించగా టీచర్లు, స్టూడెంట్స్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కార్యక్రమంలో స్టూడెంట్స్ ఉత్సాహంగా పాల్గొన్నారు.