కేతకీలో ఎమ్మెల్యేలు పూజలు

MLAs worship in Ketaki
MLAs worship in Ketaki

ఝరాసంగం[Jharasangam] జనవరి 22 సిరి న్యూస్ :
దక్షణ కాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి దేవాలయానికి నర్సాపూర్ ఎమ్మెల్యే సునితా లక్ష్మారెడ్డి, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు బుధవారం ఆలయాన్ని దర్శించుకున్నారు. ముందుగా ఆలయ రాజగోపురం ముందు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.అనంతరం గర్భగుడిలోని పార్వతీ సమేత సంగమేశ్వర స్వామిని దర్శించుకుని రుద్రాభిషేకం నిర్వహించారు.ఆలయ అర్చకులు తీర్థప్రసాదాలను అందజేసి పూలమాలశాలతో సన్మానించారు.ఈ కార్యక్రమంలో ఉమ్మడి మెదక్ జిల్లా డిసిఎంఎఫ్ చైర్మన్ మల్కాపురం శివకుమార్, మండల బి ఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు వెంకటేశం,మాజీ సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు బొగ్గుల జగదీశ్వర్,బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు నామ రవి కిరణ్, కేతకి ఆలయ మాజీ చైర్మన్ నీల వెంకటేశం,బిఆర్ఎస్ నాయకులు ఎంపీ నాగన్న పటేల్, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.