నారాయణఖేడ్ జనవరి 12 (సిరి న్యూస్)
నారాయణఖేడ్: పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో స్వామి వివేకానంద జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించిన నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి, అనంతరం ఎమ్మెల్యే మున్సిపల్ కార్యాలయంలోని స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు.అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ యువత స్వామి వివేకానంద గారిని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని ఎమ్మెల్యే అన్నారు. స్వామి వివేకానంద మన దేశభక్తి గురించి మరియు దేశ సంస్కృతి గురించి అనేక ఇతర దేశాలలో మన దేశం గొప్పతనం గురించి ఎంతో చక్కగా వివరించారన్నారు. వారి జయంతిని పురస్కరించుకొని జాతీయ యువజన దినోత్సవంగా మనం జరుపుకుంటున్నామని ఎమ్మెల్యే అన్నారు.కార్యక్రమంలో ఎమ్మెల్యే గారితో పాటు మున్సిపల్ వైస్ చైర్మన్ దారం శంకర్ సెట్, వివేకానంద రాజేష్ చౌహాన్, రామకృష్ణ, మాజిద్ నర్సింలు, కౌన్సిలర్లు,ఆకాశ్ రావు పాటిల్ మనుర్ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు, చంద్రశేఖర్ ఆచార్య, మధుసూదన్ రెడ్డి, రాజు, తదితరులు పాల్గొన్నారు.