మాజీ మంత్రి హరీష్ రావుకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే చింతా ప్రభాకర్

సంగారెడ్డి ప్రతినిధి, జూన్ 3 (సిరి న్యూస్):

మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావుని హైదరాబాద్ లో సంగారెడ్డి శాసనసభ్యులు చింతా ప్రభాకర్ మర్యాదపూర్వకంగా కలిశారు. మంగళవారం హరీష్ రావు  జన్మదినం సందర్భంగా ఆయనకు ఎమ్మెల్యే చింత ప్రభాకర్ శాలువాతో సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. గతంలో మాజీ మంత్రి హరీష్ రావు సహాయ సహకారాలతో సంగారెడ్డి నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకెళ్లిందని గుర్తు చేశారు. సుదీర్ఘ కాలం రాజకీయంలో ఉండాలని , ప్రజా సేవ చేయాలని చింత ప్రభాకర్ ఆకాంక్షించారు.