అదృశ్యమైన వ్యక్తి ఆచూకీ లభ్యం

missing-person-found
missing-person-found

నర్సాపూర్[Narsapur]జనవరి 24 సిరి న్యూస్
ఒక పూట ఆహారం తీసుకోకపోతే నీరసంగా ఉంటుంది అలాంటి ఒక వ్యక్తి వారం రోజులపాటు నీరు ఆహారం తినకుండా ఉన్నారు మృత్యుంజయుడు గా బయటకు వచ్చాడు. కుంభమేళాకు వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో ఈనెల 18 వ తారీఖున మెదక్ మండలం అవుసలపల్లి గ్రామానికి చెందిన నాగారం మల్లేశం(56) నర్సాపూర్ పట్టణంలో తప్పిపోయినట్టు సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా గుర్తించారు. కుటుంబ సభ్యులు నర్సాపూర్ పోలీస్ స్టేషన్లో లో ఫిర్యాదు చేశారు. రెండు రోజులపాటు నర్సాపూర్ పట్టణ పరిసరాలలో వెతికిన ఎక్కడ జాడ తెలియలేదు. శుక్ర‌వారం నర్సాపూర్ పట్టణంలో హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ ముందు అండర్ డ్రైనేజ్ లో ఎవరో ఒక మనిషి ఉన్నట్టు స్థానికులు గమనించారు.సమీపంలో ఉన్న రాష్ట్ర బిజెపి కార్యవర్గ సభ్యుడు మురళి యాదవ్ కు ఈ సమాచారం తెలియడంతో స్థానికుల సహాయంతో అతన్ని బయటకు తీశారు.వారం రోజుల పాటు నీరు ఆహారం తినకుండా అండర్ డ్రైనేజీ లో ఉండి మృత్యుంజయుడు గా బయటకు వచ్చారని భూమి మీద నూకలు బాకీ ఉన్నాయని స్థానికులు చర్చించుకున్నారు. పోలీసులు వచ్చి అతనిని కుటుంబ సభ్యులకు అప్పగించడం జరిగింది.