జనవరి 28 ( సిరి న్యూస్ )
సంగారెడ్డి[sangareddy].
సంగారెడ్డి పట్టణ నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సర-2025 క్యాలెండర్‌ను మంగళవారం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ చేతులమీదుగా ఆవిష్కరింపజేశారు. ఈ సందర్భంగా సంగారెడ్డి పట్టణ నాయి బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షుడు లకుడారం మాణిక్ ప్రభు నాయి మాట్లాడుతూ.. క్షౌర వృత్తిపై ఆధారపడిన నాయి బ్రాహ్మణులు నిర్వహిస్తున్న హెయిర్ సెలూన్లకు 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి రుణపడి ఉంటామని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి దామోదర్ రాజనర్సింహ నాయి బ్రాహ్మణుల అభ్యున్నతి కోసం పాటపడుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు ఆకాశ వేణి, ప్రధాన కార్యదర్శి శ్రీశైలం,అధ్యక్షులు దత్తాత్రేయ, వర్కింగ్ ప్రెసిడెంట్, సీనియర్ జర్నలిస్ట్ సాయినాథ్, ఉపాధ్యక్షులు రంజోల్ ప్రభు, కోశాధికారి శేఖర్, కార్యదర్శి మురారి, ఉప కోశాధికారి స్వాగత్ ప్రభు, సలహాదారులు పెంటయ్య, సత్యం, కేతకి అశోక్, కుమార్, యూత్ ,అధ్యక్షులు ఆంజనేయులు, అధ్యక్షుడు చరణ్, ప్రధాన కార్యదర్శి రాము, ముఖ్య సలహాదారులు సంగమేశ్వర్, సాయి సంగమేష్ తదితరులు పాల్గొన్నారు.