చేగుంట[chegunta] ఫిబ్రవరి 05,సిరి న్యూస్
మెదక్ జిల్లా చేగుంట పట్టణ కేంద్రం లోని కస్తూర్బా గాంధీ పాఠశాలను తనిఖీ చేసిన జిల్లా డి డబ్ల్యూవో, మండల స్పెషల్ ఆఫీసర్ హైమమతి ఆకస్మిక తనిఖీ చేశారు,ఆమె ఈ సందర్బంగా మాట్లాడతూ ప్రభుత్వ ఆదేశానుసారం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పాఠశాలను తనిఖీ చేయడం జరుగుతుందని అన్నారు, అనంతరం పాఠశాలలో ఉన్నటువంటి పంట గదిని సందర్శించారు, విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని,అలాగే విద్యార్థులు చక్కగా చదువుకొని మంచి పేరు తేవాలని వారు విద్యార్థులకు కోరారు,ఈ కార్యక్రమం లో మండల అధికారులు,ప్రధానోపాధ్యాయురాలు , ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు