38గ్రామలు ఎండిన గంజాయి, గంజాయి మొక్కలు, సెల్‌ఫోన్ స్వాధీనం
విలేకర్లకు తెలిపిన ఎస్ఐ షేక్ మహబూబ్
మద్దూరు, జనవరి 8 సిరి న్యూస్ : మద్దూరు మండలంలోని నర్సాయపల్లి గ్రామంలో గంజాయి (Ganja) సాగు చేస్తున్న మహమ్మద్ షబ్బీర్, ను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు మద్దూరు ఎస్సై షేక్ మహబూబ్ బుధవారం విలేకరులకు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నర్సాయపల్లి, గ్రామానికి చెందిన మహమ్మద్ షబ్బీర్, అనే వ్యక్తి గత కొన్ని రోజుల నుండి వారి ఇంట్లో గంజాయి మొక్కలను సాగు చేస్తూ గంజాయిని ఎండబెట్టి బీహార్ రాష్ట్రానికి చెందిన కూలీలకు విక్రయిస్తున్నాడని ఆయన తెలిపారు.
నమ్మదగిన సమాచారంతో టాస్క్ ఫోర్స్ పోలీసుల సహకారంతో బుధవారం షబ్బీర్ ఇంటి వద్దకు వెళ్లి తనిఖీ చేయగా అతని దగ్గర 38 గ్రాముల ఎండిన గంజాయి ఉందని. అలాగే తన ఇంటి పెరట్లో రెండు మొక్కలు నాటి ఉండడంతో గంజాయిని మొక్కలను..అతను వాడిన సెల్ ఫోన్ స్వాధీనం చేసుకొని అతన్ని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ విజయ్ కుమార్, హెడ్ కానిస్టేబుల్ జనార్ధన్, కానిస్టేబుల్ శ్రీనివాస్, నాగరాజు, తదితరులు ఉన్నారు .