ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవరెడ్డి నివాసానికి వచ్చిన మల్లికార్జున్ అప్పాజీ
నారాయణఖేడ్ జనవరి 18 (సిరి న్యూస్)
నారాయణఖేడ్, పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో శనివారం కర్ణాటక రాష్ట్రంలో ఎంతో ప్రసిద్ధిగాంచిన శ్రీశ్రీశ్రీ మల్లికార్జున్ అప్పాజీ ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకు నారాయణఖేడ్ నియోజకవర్గం ప్రజలకు అప్పాజీ ఆశీర్వాదం ఇవ్వడం జరిగింది. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ అప్పాజీ మన నారాయణఖేడ్ నియోజకవర్గానికి రావడం ఎంతో సంతోషంగా ఉందని వారి ఆశీస్సులు మన నారాయణఖేడ్ నియోజకవర్గ ప్రజలు సుఖశాంతులతో ఉండాలని ఆయన దర్శనం మహాభాగ్యం అని అన్నారు. ఇంత అర్ధరాత్రి అయినా అప్పాజీ కోసం భారీ ఎత్తున ప్రజలు వేచి ఉన్నందుకు ప్రజలకు యువకులకు నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే దంపతులు పట్లోళ్ల అనుపమ, సంజీవరెడ్డి, పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి, డిసిసి ప్రధాన కార్యదర్శి పట్లోళ్ల సుధాకర్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ నాయకులు పట్లోళ్ల లోకేష్ రెడ్డి, యువ నాయకులు ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు పాల్గొని అప్పాజీ గారికి ప్రత్యేక పూజలు నిర్వహించరు.
ఈ కార్యక్రమంలో నారాయణఖేడ్ నియోజకవర్గం లోని అప్పాజీ భక్తులు మరియు ఎమ్మెల్యే అభిమానులు కార్యకర్తలు ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొని అప్పాజీ ఆశీర్వాదం తీసుకున్నారు