పెద్ద శంకరంపేట[pedda shankaram peta], (సిరి న్యూస్):
మెదక్ జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షునిగా వోల్దాస్ మల్లేష్ గౌడ్ ను రాష్ట్ర నాయకత్వం నియమించగా జిల్లా పార్టీ కార్యాలయంలో పెద్ద శంకరంపేట బిజెపి మండల అధ్యక్షుడు కోణం విట్టల్ మర్యాద పూర్వకంగా కలిసి శాలువాలు బొకేలతో ఘనంగా సత్కరించారు.. అనంతరం పేట మండల అధ్యక్షుడు కోణం విఠల్ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ బిజెపి రాష్ట్ర నాయకత్వం పిలుపుమేరకు ప్రజా సమస్యలపై పోరాడటానికి మెదక్ జిల్లా అధ్యక్షుడు మల్లేష్ గౌడ్ నాయకత్వంలో భారతీయ జనతా పార్టీని అన్ని వర్గాల ప్రజలకు చేరువయ్యేలా పని చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల బిజెపి నాయకులు ఓబీసీ సెల్ అధ్యక్షులు బండల శ్రావణ్, కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.