నారాయణఖేడ్ [Narayankhed] జనవరి 9 (సిరి న్యూస్)
నారాయణ ఖేడ్ నియోజకవర్గం కంగ్టి మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్ నియోజకవర్గ ఇన్చార్జి అలీగే జివన్ మాదిగ అధ్యక్షతన మరియు ఎం జి ఎఫ్ జిల్లా అధ్యక్షులు విజయ్ మాదిగ ఆధ్వర్యంలో డప్పులతో భారీ ర్యాలీ నిర్వహించాడం జరిగింది.మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు మరియు కోళ్ళ శివ మాదిగ ఎమ్మార్పీఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ఉమ్మడి జిల్లా ఇన్చార్జి గారి సమన్వయంలో ఎస్సీ వర్గీకరణ తెలంగాణ రాష్ట్రంలో యుద్ద ప్రాతిపదికన అమలు చేయాలని డిమాండ్ చేస్తూ..ఫిబ్రవరి 7న వెయ్యి గొంతులు లక్షా డప్పుల మహా ప్రదర్శన విజయవంతనికై కంగ్టి మండల కేంద్రంలో భారీ డప్పులతో ర్యాలీ నిర్వహించాడం జరిగింది.
అలాగే ఎమ్మార్పీఎస్ నూతన మండల కమిటీ ఎన్నుకోవడం జరిగింది.
ఈకార్యక్రమంలో పెద్ద గీత మాదిగ, ముక్కగల్ల కవిత మాదిగ, అలిగే జివన్ మాదిగ, విజయ్ కుమార్ మాదిగ, కాశీపురం ఆంజనేయులు మాదిగ, కంగ్టి మండల ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు మాదిగ యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.