సిరి న్యూస్/ గుమ్మడిదల[Gummadidala]
గుమ్మడిదల మండల పరిధిలోని బొంతపల్లి ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు బహుమతుల ప్రధానం చేశారు. గణతంత్ర దినోత్సవ సందర్భంగా విద్యార్థులకు ఆటల పోటీల కార్యక్రమాలు నిర్వహించిన సందర్భంగా గెలుపొందిన విద్యార్థులకు బొంతపల్లి పారిశ్రామిక వాడలోని హెటిరో పరిశ్రమ సీనియర్ మేనేజర్ ఉమామహేశ్వర్ రెడ్డి గారు విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు అంజయ్య మాట్లాడుతూ దానాలలో కెల్లా విద్యా దానం గొప్పది, ప్రార్థించే పెదవుల కన్నా, సహాయం చేసే చేతులు మిన్న అంటూ హెటిరో సంస్థ వారు మండలంలోని ఎంతోమంది పేద విద్యార్థులకు ఉచితంగా బట్టలు, బ్యాగులు, నోటుపుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్లు వంటి అనేక రకాల విద్యా,ఆరోగ్య సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా బహుమతులు అందించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. సంస్థ సహాయ సహకారాలు మా పాఠశాలపై ఎల్లవేళలా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు అబ్దుల్లా, వినోద్, సునీత, అపర్ణ, శారద, బుజ్జి బాయ్ వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు