పాపన్నపేట[Papannapet], జనవరి 11, (సిరి న్యూస్) :
పవిత్ర పుణ్యక్షేత్రమైన ఏడుపాయల శ్రీ వరం దుర్గామాతను మహబూబ్నగర్ జిల్లా మరియు సెక్షన్ జడ్జి బి పాపిరెడ్డి శనివారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వీరికి ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవస్థానం తరపున ఉద్యోగి ప్రతాప్ రెడ్డి జడ్జి దంపతులను సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం సిబ్బంది మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.