మహాత్మా.. బూటకపు హామీలతో ప్రజలను మోసం చేస్తున్న ఈ కాంగ్రెస్.

Mahatma.. This Congress is deceiving people with fake promises.
Mahatma.. This Congress is deceiving people with fake promises.

సిరి న్యూస్ అందోల్[andole] :
తెలంగాణలోని అమాయక ప్రజలను 420 బూటకపు హామీలతో మోసం చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నేటికీ 420 రోజులు పూర్తయినందున ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసేలా ఈ పాలకులకు బుద్ధిని ప్రసాదించు మహాత్మ అంటూ. బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుమేరకు మాజీ ఎమ్మెల్యే శ్రీ క్రాంతి కిరణ్ ఆదేశానుసారం బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు జోగిపేట మధ్యరంగం క్లాక్ టవర్ వద్ద నిర్వహించిన మహాత్మా గాంధీ విగ్రహానికి వినతిపత్రం అందజేసిన AMC మాజి చైర్మన్ డి బి నాగభూషణం సీనియర్ నాయకులు చాపల వెంకటేశం BRS నాయకులతో
కలిసి వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. అధికారమే లక్ష్యంగా, ప్రజలు ఏమైపోతే మాకేంటి అనే రీతిలో అమలుకు సాధ్యం కానీ హామీలతో తెలంగాణ ప్రజలను మోసం చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది.
అభయహస్తం అంటూ అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే తెలంగాణ ప్రజల పాలిట బస్మాసుర హస్తంగా కాంగ్రెస్ పాలన తయారయింది.
రైతే దేశానికి వెన్నుముక అని నమ్మి గత పాలకుల పాలనలో దండగగా మారిన వ్యవసాయాన్ని మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ వంటి పథకాలతో పండగగా
మార్చిన గొప్ప దార్శనికులు, తెలంగాణ రాష్ట్ర సాధకులు కెసిఆర్ గారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం అధికారమే లక్ష్యంగా మేము అధికారంలోకి వస్తే రైతు భరోసా కు 15 వేలు, రైతు కూలీలకు 12 వేలు ఇస్తామని రైతులను నమ్మించి గొంతు కోసింది. రైతు భరోసాను పెంచే విషయం పక్కకు పెడితే ఉన్న 12 వేలకు కూడా అర్హతల పేరిట అడ్డగోలు కొర్రీలను పెడుతూ ఒకసారి సంక్రాంతి, మరోసారి జనవరి 26, ఇంకొకసారి మార్చి 31 అంటూ రైతులను బూటకపు మాటలతో మోసం చేస్తున్నారే తప్పా రైతు పక్షపాతిగా కాంగ్రెస్ ప్రభుత్వం నిలుస్తుంది అన్న నమ్మకం రైతన్నకు ఇసుమంతైనా లేదు.
ఇప్పుడు రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల పేరుతో మరో కొత్త నాటకానికి తెర లేపుతూ ఇదొక చారిత్రాత్మక కార్యక్రమం, గతంలో ఎప్పుడూ లేదు అనే విధంగా చెబుతున్న ముఖ్యమంత్రి భావదారిద్రాన్నీ తెలంగాణ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు.
కానీ నేడు ఈ కాంగ్రెస్ పాలకులు మాత్రం గ్రామసభలు, వార్డు సభల పేరుతో నానా హైరాన చేస్తూ జాబితాలను ప్రకటిస్తూ మరోసారి తెలంగాణ ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, అసలు వాళ్లు వెల్లడించే జాబితా అర్హుల జాబితానా.దరఖాస్తుదారుల జాబితానా. అనేది వారికే స్పష్టం లేదు. సంక్షేమ పథకాల విషయంలో మంత్రుల మాట ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా తయారైంది.
ప్రభుత్వం సంక్షేమం విషయంలో తెలంగాణ ప్రజలను మోసం చేయకుండా ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చే వరకు ప్రజల పక్షాన బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు.
ఆడలేక పాత గజ్జలు అన్నట్టుగా మీకు పాలన చేతకాక బిఆర్ఎస్ పార్టీపై నిందలు వేయడం సరికాదు.
మహాత్మా గాంధీ పేరుతో గద్దెనెక్కిన ఈ డూప్లికేట్ గాంధీలకు, దద్దమ్మ కాంగ్రెస్ సర్కారుకు 420 హామీలు అమలు చేసే విధంగా ఆ మహాత్ముడు మంచి బుద్ధిని ప్రసాదించాలని కోరుకుంటున్నాం.
ఈ కార్యక్రమంలో BRS నాయకులు పుర్ర సంతోష్, మొగులయ్య, బిర్ల శంకర్, మహేష్ యాదవ్, నాయికోటి అశోక్, బాబా ఖాన్, సల్మా డాక్టర్, ఎర్ర గొల్ల సంతోష్ తదితరులు పాల్గొన్నారు.