కౌడిపల్లి[Kowdipally],ఫిబ్రవరి 1( సిరి న్యూస్)
మండల కేంద్రమైన కౌడిపల్లి లో శనివారం మార్కండేయ మహర్షి జయంతిని పురస్కరించుకొని కౌడిపల్లి పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పద్మశాలి సంఘం స్థలం షెడ్ వద్ద పతాకావిష్కరణ చేసి మార్కండేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం మండల అధ్యక్షుడు పిసికే నర్సింలు జిల్లా యువత ఉపాధ్యక్షుడు సంభారపు తిరుమలేష్, డాక్టర్ పురుషోత్తం, పద్మ దుర్గయ్య, పోల ప్రభాకర్, సగ్గెం భీమేష్ , మంత్రి కృష్ణ, వెంకటయ్య, నర్సింలు, శ్రీనివాస్, పోల పురుషోత్తం, పోల నవీన్, s శ్రీనివాస్, పి శ్రీనివాస్, పి శ్రీను, ఆర్ఎంపీ వైద్యులు శ్రీను, రవి, కృష్ణ తోపాటు పోల లక్ష్మణ్, పద్మ సత్యనారాయణ, తిరుపతి, నరేందర్, మంత్రి గంగారాం, తదితరులు పాల్గొన్నారు.