ఆడబిడ్డలకు అక్షరాన్ని పరిచయం చేసిన మహనీయురాల

Mahaneyurala who introduced the alphabet to girls
Mahaneyurala who introduced the alphabet to girls

-సామాజిక విప్లవకారిణి సావిత్రిబాయి పూలే
-నీలం మధు ముదిరాజ్
-చిట్కుల్ లో ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి
-సావిత్రిబాయి జయంతిని మహిళ ఉపాధ్యాయ దినోత్సవంగా ప్ర‌క‌టించ‌డం ప‌ట్ల హ‌ర్షం

పటాన్ చెరువు: మహిళల సమానత్వం కోసం వారి అభ్యున్నతి కోసం ఉద్యమం చేసిన సామాజిక విప్లవకారిణి సావిత్రిబాయి పూలే అని మెదక్ [Medak] పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ అన్నారు. శుక్రవారం సావిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించుకొని చిట్కుల్లోని ఎన్ఎంఆర్ క్యాంపు కార్యాలయంలో ఆమె చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నీలం మధు మాట్లాడుతూ భారతదేశ మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు గా సావిత్రిబాయి పూలే మహిళలకు విద్యను సులభతరం చేసేందుకు విశేషంగా కృషి చేశారని కొనియాడారు.

విద్య యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తూ అనేక రకాల కార్యక్రమాలను నిర్వహించారని తెలిపారు. ఆమె “గో గేట్ ఎడ్యుకేషన్” కవిత ద్వారా అణగారిన వర్గాలకు విద్యాభ్యాసం గొప్పతనాన్ని వివరిస్తూ ప్రోత్సహించిందన్నారు.మొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా ప్రస్థానం ప్రారంభించిన ఆ మహనీయురాలు తర్వాత కాలంలో 17 పాఠశాలలను ప్రారంభించి మహిళా విద్యను ప్రోత్సహించిందని తెలియజేశారు. ఆమె సేవలను గుర్తించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రభుత్వం ఆమె జయంతి అయిన జనవరి 3వ తేదీని ప్రతి ఏట మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించిందని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా మహిళా ఉపాధ్యాయులందరికీ మహిళా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు ఆయన తెలిపారు.