సిరి న్యూస్ /గుమ్మడిదల[gummadidalila]
గుమ్మడిదల ఆలయ కమిటీ చైర్మన్ గా మద్దుల బాల్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆదివారం మండల కేంద్రమైన గుమ్మడిదలలోని రైతు సంఘం భవనం వద్ద నూతన కమిటీని ఎన్నుకున్నారు. ముందుగా ఎన్నికలకు పొట పోటిగా సాగింది. ప్రస్తుత ఆలయ కమిటీ చైర్మన్ పడమటి లక్ష్మారెడ్డి మరియు మద్దుల బాల్ రెడ్డి మధ్య నువ్వా నేనా అన్నట్లుగా సాగింది. చివరికి వారి మధ్య సయోధ్యకు వచ్చినారు. అందరి అభిప్రాయం మేరకు మద్దుల బాల్ రెడ్డిని ఆలయ కమిటీ చైర్మన్ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షులుగా పడమటి లక్ష్మారెడ్డిని ఎన్నుకున్నారు. పూర్తి కమిటీని త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు. ప్రస్తుతం భారీ స్థాయిలో నిర్మాణం జరుగుతున్న శ్రీ కళ్యాణ రామచంద్రస్వామి ఆలయ నిర్మాణం పనులు చురుకుగా సాగే విధంగా అందరి దాతల సహకారంతో గ్రామస్తుల ప్రోత్సాహంతో ఆలయ నిర్మాణమును పూర్తి చేస్తానని తెలిపారు.