నారాయణఖేడ్[Narayankhed]: ఫిబ్రవరి 7 (సిరి న్యూస్)
మండలం పరిధిలోని నమ్లిమేట్, గ్రామంలో శుక్రవారం నాడు, శివ స్వాముల మహా పడిపూజ ఘనంగా నిర్వహించారు. పురోహితులు గురురాజశర్మ ఆధ్వర్యంలో శివలింగానికి రుద్రాభిషేకం, గణపతి పూజా, సహస్రనామావళి, శివ స్తోత్రం, శివార్చన, పుష్పాభిషేకం, హారతి, భజన కార్యక్రమాలు వైభవంగా జరిగాయి. వివిధ గ్రామాల నుండి భారీగా శివ స్వాములు పాల్గొన్నారు. శివనామ స్మరణ మార్మోగింది.