భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమం విజయవంతం చేయాలి
కుడంబల్ అయి.
జనవరి 11జహీరాబాద్ ( సిరి న్యూస్)
ఈనెల 13న శుద్ధ పౌర్ణమి సందర్భంగాప్రజల భాదల నివారర్థం ప్రతి సంవత్సరం మాదిరిగానే జహీరాబాద్[zaheerabad] చిన్న హోతి శివారులోని సత్వార్ గుండెరావు వ్యవసాయ క్షేత్రంలో గల ఆయి మందిరంలో భవాని మాత యజ్ఞము నిర్వహించడం జరుగుతుందని ఆలయ సిబ్బంది తెలియజేశారు. కుడంబల్ ఆయిగారు సంకల్పించిన ప్రతి సంవత్సరాను సారము లోకకళ్యాణార్థము శ్రీ వేణు భట్ మహారాజు గారి ఆధ్వర్యంలో ఈ కార్యము నిర్వాయంచడం జరుగుతుందని,అలాగే మాతయజ్ఞము చేయబడుతుందన్నారు. శ్రీ క్రోధి నామ సంవత్సరం బహుళవిదియ శుక్రవారం తేదీ 31 /1/25 రోజున మధ్యాహ్నం ఒంటి గంట అయిదు నిమిషములకు వృషభ లగ్నం నందు యంత్రా మరియు ధ్వజస్తం ప్రతిష్టాపన కార్యక్రమము ఉంటుందన్నారు. ఇట్టి మహత్తర కార్యానికి సకాలములో అధిక సంఖ్యలో పాల్గొని ఇట్టి కార్యక్రమంలో తను, ,మన ,ధనములతో సేవ చేసి తీర్థప్రసాదాలను స్వీకరించి భగవంతుని కృపకు పాత్రులు కావాలని సూచించారు .