మానవ మనుగడ కోసం పశు సంపద పెంచాలి : మాజీ ఎమ్మెల్యే

Livestock should be increased for human survival: Former MLA Bhupal Reddy
Livestock should be increased for human survival: Former MLA Bhupal Reddy

నారాయణఖేడ్ : మానవ మనుగడకు పాడి పశువుల పాలు చాలా ముఖ్యం. జనాభా పెరుగుతుంది.. కానీ పశు సంపద తగ్గుతుంది. దీని వల్ల మనకు నాణ్యమైన పాలు దొరకడంలేదు. దీని వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. అందుకే ప్రతి వ్యవసాయ రైతు పంటకు తోడు ఒక పాడి పశువు పెంచుకోవాలని మాజీ శాసన సభ్యులు భూపాల్ రెడ్డి అన్నారు.

సోమవారం నాడు జిల్లా పశు ఘణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో పశుసంవర్ధక శాఖ సహకారంతో కల్హెర్ మండలం ఖానాపూర్ (K)గ్రామంలో నిర్వహించిన ఉచిత పశువైద్య శిభిరంలో ఆయన పాలొగొన్నారు. ఈ సందర్బంగా రైతులతో పాడి పశువుల వల్ల కలిగే ప్రయోజనాల గురుంచి తెలిపారు. ఈ కార్యక్రమంలో కల్హెర్ మండలం పశువైద్యాధికారి డాక్టర్ గీతా. గోపాల మిత్ర సూపర్ వైజర్ తుక్కా రెడ్డి. వి. ఏ.జగదీష్. నారాయణ. గోపాల మిత్రలు ఏస్ సంతోష్. జి. శ్రీనివాస్. జి.సాయిలు. ఏ. సాయిలు.సి.హెచ్. మల్లేశం.మరియు పాడి రైతులు పాల్గొన్నారు.