నారాయణఖేడ్[Narayankhed]జనవరి 28 (సిరి న్యూస్)
దేశంలోనే అత్యున్నత పౌర పురస్కారాలలో పద్మ అవార్డులు మూడు విభాగాలలో ప్రదానం చేయబడతాయి.పద్మవిభూషణ్, పద్మ భూషణ్ , పద్మశ్రీ. కళ, సామాజిక సేవ, ప్రజా వ్యవహారాలు, సైన్స్, ఇంజినీరింగ్, వాణిజ్యం, పరిశ్రమలు, వైద్యం, సాహిత్యం, విద్య, క్రీడలు మరియు పౌర సేవ వంటి విభిన్న రంగాలలో అత్యున్నత ప్రతిభను కలిగినవారికి ఈ అవార్డు అందిస్తారు. తెలంగాణకు చెందిన ప్రపంచ ప్రఖ్యాత జీర్ణ కోశ వ్యాధుల నిపుణుడు డాక్టర్, దువ్వూరు నాగేశ్వర్‌రెడ్డిని ఈ ఏడాది అత్యంత ప్రతిష్ఠాత్మకమైన పద్మ విభూషణ్ వరించింది. తెలుగు చలనచిత్ర రంగానికి చెందిన ప్రముఖ నటుడు,శాసన సభ్యుడు బాలకృష్ణకు పద్మభూషణ్ పురస్కారం లభించింది. తెలంగాణకు చెందిన మాదిగ రిజర్వేషన్ ఉద్యమకారుడు మందకృష్ణ మాదిగకు లభించింది అందులో భాగంగా పద్మ అవార్డు గ్రహీతలకు వినూత్నంగా ఆశ్వత్త పత్రాలపై వారి చిత్రాలను వేసి శుభాకాంక్షలు, తెలియజేసిన నారాయణఖేడ్ కు చెందిన
లీఫ్ ఆర్టిస్ట్..గుండు శివకుమార్.
Home జిల్లా వార్తలు పద్మ అవార్డు గ్రహీతల చిత్రాలను వినూత్నంగా రాగి ఆకుపై గీసిన లిఫ్ ఆర్టిస్ట్ గుండు శివకుమార్.