సంగారెడ్డి : సంగారెడ్డి జిల్లా న్యాయాసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం కొత్లాపూర్ మహాత్మాజ్యోతిబా పూలే బాలికల రెసిడెన్సియల్ పాఠశాలలో విద్యార్థలకు న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. న్యాయ అవగాహన సదస్సుకు ముఖ్య అతిధిగా విచ్చేసిన జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి. రమేష్ మాట్లాడుతూ పిల్లలకు అన్ని చట్టలపైనా అవగాహనా ఉండాలి అన్నారు.
అందరు క్రమశిక్షణగా ఉండాలి అన్నారువిద్యార్థులకు, ఉపాధ్యాయులు న్యాయ పరమైన విషయాలలో ఉచిత న్యాయ సహాయం అందిస్తామని ఏదైనా న్యాయ సహాయం కోరినచో న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయం, సంగారెడ్డిని సంప్రదించాలన్నారు.ఈ సదస్సు నందు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి. రమేష్ ప్రిన్సిపాల్ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.