
జనవరి 22 ( సిరి న్యూస్ )
సంగారెడ్డి.[sangareddy]
సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని హాజ్రత్ ఫతే ఖాన్ సాబ్రీ మజ్జూబ్ రహేమాతుల్లాఅ లైహి 140వ ఉర్సు ఉత్సవాల్లో భాగంగా ఫోరమ్ ఫర్ బెటర్ సంగారెడ్డి ఆధ్వర్యంలో పూల చాదర్ ని సమర్పించి దర్గాలో నిర్వాహకుల సమక్షంలో ప్రార్థనలు చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్న ఫోరమ్ ఫర్ బెటర్ సంగారెడ్డి అధ్యక్షులు, శ్రీధర్ మహేంద్ర,ఉపాధ్యక్షులు సజ్జాద్ ఖాన్, మాట్లాడుతు ఆధ్యాత్మిక భక్తితో ప్రతి ఒక్కరు ప్రేమ,శాంతి, సేవ భావన్ని ఆధ్యాత్మిక ఆచరణలో పొందాలని. హాజ్రత్ ఫతే ఖాన్ సాబ్రీ మజ్జూబ్ రహేమాతుల్లాఅ లైహి ఉత్సవాలకు వచ్చే భక్తులకు దర్గా కమిటీ ఆధ్వర్యంలో చేసిన ఏర్పాట్లు వైభవంగ ఉన్నాయన్నారు. దర్గాను మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూన్నాం అన్నారు. ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్న ఫోరమ్ నాయకులని దర్గా కమిటీ నిర్వాహకులు గులం సమద్ సందాని, వారి బృందం అడ్వకేట్ లు, మహబూబ్ అలీ, మొహమ్మద్ అలీ, మాజీ సర్పంచ్ వజీర్ అలీ, జుబెర్ మీరాజ్ హష్మీ,లు పూలమాల వేసిసత్కరించారు.ఇట్టి కార్యక్రమంలో ఫోరమ్ ప్రధాన కార్యదర్శి మహేష్ కుమార్, సహా కార్యదర్శి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు