
నారాయణఖేడ్[Narayankhed]: జనవరి 30 (సిరి న్యూస్)
మహాత్మా గాంధీ 77వ వర్ధంతి సందర్భంగా నారాయణఖేడ్ పట్టణంలోని మహాత్మా గాంధీ విగ్రహనికి పూలమాల వేసి ఘన నివాళి అర్పించిన ఆర్యవైశ్య అనుబంధ సంఘాల నాయకులు. ఈ సందర్భంగా జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు మునిగల మాణిక్ ప్రభు, మాట్లాడుతూ జాతిపిత మహాత్మా గాంధీ సత్యం, ధర్మం, నీతి, నిజాయితీ, అహింస సత్యాగ్రహాలతో బ్రిటిష్ పాలకులను దేశం నుండి తరిమి కొట్టి స్వాతంత్రాన్ని తెచ్చిన మహనీయుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు దారం కృష్ణమూర్తి. జిల్లా ఉపాధ్యక్షులు కోటగిరి సత్యనారాయణ,మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు ఆత్మకూరు రాజు, సంఘం నాయకులు పంతంగి రమేష్, బి. గంగయ్య, రత కంటి రవీందర్, దారం కృష్ణమూర్తి, గుజ్జల్ వార్ సంతోష్ కోటగిరి ప్రభు రాజ్, అర్థం సురేష్, గంగ చంద్రశేఖర్ కన్నయ్య గారి భూమయ్య, దత్త సంగమేశ్వర్ , సంతోష్ తదితరులు పాల్గొన్నారు.