తెలంగాణ ఉద్యమ నాయకుడు మృతి

Leader of Telangana Movement passed away
Leader of Telangana Movement passed away

[సిరి న్యూస్] గుమ్మడిదల రూరల్[Gummadila Rural]
తెలంగాణ ఉద్యమ నాయకుడు, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బొంతపల్లి గ్రామానికి చెందిన ఉప్పునూతల గౌరీ శంకర్ గౌడ్ అనారోగ్యంతో శుక్రవారం మరణించారు. ఉమ్మడి జిన్నారం మండల పార్టీ అధ్యక్షునిగా రెండుసార్లు కొనసాగారు. బొంతపల్లి గ్రామపంచాయతీ ఉపసర్పంచిగా పరిశ్రమలకు కార్మిక నాయకుడిగా పని చేశారు. ఆయన మృతి పట్ల పలువురు పార్టీ నాయకులు కార్యకర్తలు సంతాపం వ్యక్తం చేశారు