ఇండస్ మెడికేర్ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షులు,సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు
జె మల్లికార్జున్.
మనోహరబాద్[Manoharabad] ఫిబ్రవరి 05 (సిరి న్యూస్)
—– మనోహరబాద్ మండలం లోని రామయపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని ఇండస్ మెడికేర్ పరిశ్రమలో వేతన ఒప్పందం జరిగిన సందర్భంగా ఆయనను కార్మికులు శాలువాలతో ఘనంగా సన్మానించడం జరిగింది.అలాగే కార్మికులు పరిశ్రమ ఆవరణలో జనరల్ బాడీ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది.ఈ జనరల్ బాడీకి హాజరై ఆయన మాట్లాడుతూ ఇండస్ మెడికేర్ పరిశ్రమలో చారిత్రాత్మకమేన వేతన ఒప్పందం జరిగిందని ఆయన అన్నారు. వీడిఏ ₹2.05 పైసల నుండి₹3 కు పెరుగుదల, మెడికల్ హెల్త్ ఇన్సూరెన్స్ మూడు లక్షల నుండి 5 లక్షలకు పెరుగుదల,వీటితోపాటు అన్యువల్ ఇంక్రిమెంట్, సర్వీస్ వెయిటేజ్, ఫెస్టివల్ అలవెన్స్, పెట్రోల్ అలవెన్స్, షిఫ్ట్ అలవెన్స్,అలాగే 7 మంది పర్మనెంట్,మరొక 10 మంది కార్మికుల పర్మనెంట్ గురించి 2025,2026 చర్చించడానికి యజమాన్యం అంగీకారిచడం జరిగిందని, మినిమ గా ₹10,200ల నుండి గరిష్టoగా ₹15000 పైగా సాధించుకున్నారని ఇలా మెరుగైన వేతన ఒప్పందాలు చేయడం సిఐటియూ కే సాధ్యమన్నారు. కార్మికులు ఐక్యంగా ఉండి సీఐటీయూ గెలిపించుకొని, మెరుగైన వేదన ఒప్పందాన్ని సాధించుకోవడం జరిగిందన్నారు.అలాగే మెదక్ జిల్లాలో పారిశ్రామిక ప్రాంతాలలో కార్మికులచేత పరిశ్రమ యజమాన్యాలు 10 నుంచి 12 గంటలు పని చేయిస్తున్నారని .వలస కార్మికులకు వలస కార్మికుల చట్టాన్ని అమలు చేయకుండా శ్రమ దోపిడీ పరిశ్రమ యజమాన్యాలు చేస్తున్నాయి.సీఐటీయూ పోరాటాలు చేసిన చోట కనీస వేతనాలు పరిశ్రమల యజమాన్యాలు అమలు చేస్తున్నాయని అలాగే రాబోయే కాలంలో పరిశ్రమలలో కనీస వేతనాలు అమలు చేయని చోట అమలు చేసే విధంగా పోరాటాలు నిర్వహిస్తామన్నారు. పరిశ్రమలలో లేబర్ అధికారుల పర్యవేక్షణ కరువైందన్నారు. వెంటనే కనీస వేతనాలు అమలు చేయని పరిశ్రమలపై చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. గత 10 సంవత్సరాలుగా 71 షెడ్యూల్ పరిశ్రమలలో కనీస వేతనాలజీవోలను సవరించలేదన్నారు.గతంలో కనీస వేతనాల సలహా మండలి సభ్యులు గా ఉన్నప్పుడు అనేక సార్లు కనీస వేతనాలు సవరించాలని ప్రభుత్వం దృష్టికి తీసుక వెళ్ళాను అన్ని ఆయన అన్నారు. మూడోసారి అధికారంలోకి వచ్చిన బిజెపి ప్రభుత్వం 44 కార్మిక చట్టాలను నాలుగు కోడ్ ల గా చేసి కార్మికుల హక్కులను హరిస్తుందని ఆయన అన్నారు.గత ప్రభుత్వం మాదిరిగానే ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కార్మికుల పట్ల మొండివైఖరిని చూపుతోందన్నారు. రాబోయే కాలంలో సిఐటియు ఆధ్వర్యంలో కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కార్మిక వర్గంతో పాటు, కేంద్ర కార్మిక సంఘాలను ఐక్యం చేసి పోరాటాలు నిర్వహిస్తామని ఆయన అన్నారు. ఉమ్మడి జిల్లాకు ఒకరే లేబర్ అధికారి ఉండడంతో పరిశ్రమల యాజమాన్యాలు కార్మికుల పట్ల ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాయని వెంటనే మెదక్ సిద్దిపేట జిల్లాలకు జిల్లా లేబర్ అధికారి ని నియమించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఇండస్ మెడికేర్ ఎంప్లాయిస్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్,సీఐటీయూ జిల్లా అధ్యక్షులు ఏ. మహేందర్ రెడ్డి, పరిశ్రమ ప్రధాన కార్యదర్శి బాలేష్,సీఐటీయూ జిల్లా కార్యదర్శి బస్వరాజు, జిల్లా ఉపాధ్యక్షులు ఏ. మల్లేష్, ఇండస్ మెడికేర్ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు తిరుపతి ,ఉపేందర్, విష్ణువర్ధన్ రెడ్డి, రమేష్,గిరి,స్వామి,సుజాత, సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు