చొరవ తీసుకొని గ్రామంలోని సమస్యలను పరిష్కరిస్తున్న సెక్రటరీ శారద
సిరి న్యూస్ కథనానికి స్పందించి వీధిలైట్ల ఏర్పాటు, పైప్లైన్ మరమ్మత్తు చేయాలని ఆదేశాలు
సంగారెడ్డి,జనవరి 7 సిరి న్యూస్
పల్లెలే పట్టుకొమ్మలు అని నానుడికి ఈ గ్రామం ఉందని చెప్పుకోవచ్చు. గ్రామంలో సర్పంచ్‌ల కాలపరిమితి పూర్తయిన తర్వాత పంచాయతీ సెక్రటరీలను గ్రామాలకు ప్రత్యేక అధికారులుగా ప్రభుత్వం నియమించారు, కొన్ని గ్రామపంచాయతీలు ప్రత్యేక అధికారులు చొరవ తీసుకోకపోవడం వలన ఆ యొక్క గ్రామాలు అభివృద్ధికి నోచుకోలేక వెనుకబడి పోతున్నాయని పలు గ్రామపంచాయతీలో ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కులబుగుర్ గ్రామపంచాయతీ సెక్రటరీ, గ్రామ ప్రజలు అండదండలతో గ్రామాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్లడానికి తనవంతు కృషి చేస్తున్నట్టు సెక్రటరీ శారద పేర్కొన్నారు.
గ్రామాలలో సిబ్బంది కొరత ఉన్న కూడా ఎప్పటికప్పుడు గ్రామాల్లో పారిశుద్ధ్యం వీధిలైట్లు మురికి కాలువలు
గ్రామంలో నీటి ఎద్దడి లేకుండా ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని గ్రామాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్తున్నామని డి ఎల్ పి ఓ అనిత, తెలిపారు. అక్కడక్కడ కొన్ని ఇబ్బందులు ఉన్నా కూడా వాటిని అధిగమిస్తూ ముందుకు వస్తున్నామని కొంతవరకు బడ్జెట్ లేకున్నా కూడా వీధిలైట్లు కల్వర్టులు పైప్లైన్ లు ఎక్కడైనా డ్యామేజ్ అయితే వేయించడం జరుగుతుందని గ్రామ ప్రజల సహకారం ఎంతగానో ఉందని డి ఎల్ పి ఓ అనిత పేర్కొన్నారు. గత నాలుగు రోజులుగా పైప్లైన్ పగిలిపోయి రోడ్డుపై మురికి నీరు ప్రవహించడంతో ( సిరి న్యూస్) ఆ గ్రామాన్ని సందర్శించడం జరిగింది. అనంతరం డియర్ పి ఓ దృష్టికి తీసుకువెళ్లగా వెంటనే వచ్చి పైప్ లైన్ కు మరమ్మతులు చేయించడం జరిగిందని అక్కడ ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేశారు.
సిరి న్యూస్ మా దృష్టికి తీసుకురావడం పరిణామామని ఇలాంటివి ఎక్కడైనా ఉంటే మా దృష్టికి తీసుకురావాలని డి ఎల్ పి ఓ అనిత, పేర్కొన్నారు. సెక్రటరీ శారద పర్యవేక్షణ ఇతరుల సహకారం తీసుకొని కొంతవరకు అభివృద్ధి చేయడం జరిగిందని పెండింగ్ లో ఉన్న వార్డులు కూడా త్వరగా పూర్తి చేస్తామని ఈరోజు స్పాట్ విజిట్ చేసిన సిరి రిపోర్టర్ తో డియర్ పిఓ అనిత అక్కడ మరమ్మతులు చేయించడం జరిగింది. ప్రకృతి వనం వెళ్లే దారిలో పైప్లైన్ పగిలిపోవడంతో అక్కడి నుండి వెళ్లే కాలనీ ప్రజలు ఇన్నాళ్లు చాలా తీవ్ర ఇబ్బందులు పడ్డామని మరికొంత చేయాల్సి ఉన్నందున త్వరలోనే పూర్తి చేస్తామని డిఎల్పిఓ అనిత పేర్కొన్నారు.
సిరి కథనానికి స్పందన…!
సంగారెడ్డి మండల పరిధిలోని కులబగుర, గ్రామపంచాయతీ పరిధిలో గల శ్రీ సాయి వెంకటేశ్వర ఎన్ క్లేవ్ రోడ్లు వీధిలైట్లు మురుగునీరు రోడ్డుపై ప్రవహిస్తుంది. సిరి దినపత్రికలు వచ్చిన కథనానికి డిఎల్పిఓ అనిత స్పందించారు, మంగళవారం శ్రీ సాయి వెంకటేశ్వర ఎన్ క్లేవ్ సందర్శించారు. వీధిలైట్లు తక్షణమే ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పొరవైపు పగిలిన మురుగునీరు పైప్లైన్ బాగు చేయాలని ఆదేశించారు.