రేపటి నుంచి కొమరవెల్లి జాతర ప్రారంభం
రెండున్నర నెలల పాటు జరగనున్న ఉత్సవాలు
సిద్దిపేట, జనవరి 18 సిరి న్యూస్
కోరిన కోర్కెలు తీర్చి భక్తులకు కొంగు బంగారమైన కొమురవెల్లి మల్లన్న జాతర ఈ నెల 19 నుంచి ప్రారంభం కానుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి వేలాదిగా ఈ జాతరకు తరలివస్తారు. సంక్రాంతి తర్వాత వచ్చే ఆదివారం మొదలుకొని ఉగాదికి ముందు వచ్చే ఆదివారం ముగుస్తుంది. సుమారు రెండున్నర నెలల పాటు కొనసాగుతుంది.ప్రతి ఆదివారం విశేష కార్యక్రమాలు నిర్వహిస్తారు. భక్తులు బోనాలతో ఆలయానికి వెళ్లి స్వామి, అమ్మవార్లకు నైవేద్యంగా సమర్పిస్తారు. పట్నం వేసి కల్యాణం జరిపించి మొక్కు తీర్చుకుంటారు.