కొల్చారం, జనవరి 9 సిరి న్యూస్ః
కొల్చారం మండల [Kulcharam] కేంద్రానికి చెందిన పి అంజన శ్రీ [Anjana shree], వై మనుష గీత హై స్కూల్ మంభోజిపల్లిలో [Mambhojipalli] 9వ తరగతి చదువుతున్నారు. వైజ్ఞానిక ప్రదర్శనలో భాగంగా ఆహారపు కల్తీ గుర్తింపు పరికరం సంబంధించిన ప్రాజెక్టు ను జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో ప్రదర్శించగా అంతిమ తీర్పుగా రాష్ట్రస్థాయికి ఎంపిక కావడం జరిగింది ఈనెల ఏడవ తేదీన మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గంలో ఏర్పాటుచేసిన రాష్ట్రస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో 11 వందలకు పైగా వివిధ అంశాలకు సంబంధించిన ప్రదర్శనలో ఆహారపు కల్తీ గుర్తింపు ప్రాజెక్టుకు ప్రథమ స్థానం దక్కడంతో వీరిని తదుపరి వైజ్ఞానిక ప్రదర్శనను ఈనెల 21 నుండి 25 వరకు దక్షిణ భారత పాండిచ్చేరిలో వీరి యొక్క ప్రదర్శనను నిర్వహిస్తారు ఈ ప్రాజెక్టుకు గైడ్ టీచరుగా గీత హై స్కూల్ మంబోజి పల్లికి యాజమాన్యంలో విధులు నిర్వహిస్తున్న భౌతిక శాస్త్రానికి సంబంధించిన ఉపాధ్యాయులు చైతన్య తన వంతు సహకారాన్ని అందిస్తూ పిల్లల పురోగతికి తోడ్పడారు. జాతీయ స్థాయికి ఎంపిక కావడంతో గీతా హైస్కూల్ యాజమాన్యంతో పాటు ఇరు కుటుంబాల తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు.