నారాయణఖేడ్[narayankhed], జనవరి 28 (సిరి న్యూస్) :
తెలంగాణ రాష్ట్ర రవాణా సంస్థ జాతీయ రోడ్డు భద్రతా మహోత్సవంలో భాగంగా మంగళవారం డిపో మేనేజర్ మల్లేషయ్య, ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర రవాణా సంస్థ జాతీయ రోడ్డు భద్రతా మహోత్సవం ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో నారాయణఖేడ్, డీ.ఎస్.పి వెంకట్ రెడ్డి, సిఐ శ్రీనివాస్ రెడ్డి, ఎస్ ఐ శ్రీశైలం, పాల్గొన్నారు.అనంతరం ఖేఢ్ డీఎస్పీ వెంకట్ రెడ్డి, మాట్లాడుతూ…సిబ్బంది సమయపాలన పాటించాలని అదేవిధంగా ఆర్టీసీ డ్రైవర్లు పోన్ మాట్లాడుతూ డైవింగ్ చేయవద్దని ప్రతి ఒక్కరు ట్రాపిక్ నిబంధనలు పాటించాలని సిబ్బందికి సూచించారు.ప్యాసింజర్లకు క్షేమంగా స్టాప్ల వద్ద చేర్చడంలో నిర్లక్ష్యం చేయొద్దన్నారు. 20మంది సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ మల్లేషయ్య తెలిపారు. ఎలాంటి సంఘటనలు జరగకుండా బస్సులు నడపాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Home జిల్లా వార్తలు “ఖేడ్” ఆర్.టి.సి. డిపో గేట్ మీటింగ్ లో పాల్గొన్న. మేనేజర్, మల్లేషయ్య, డి.ఎస్.పి. వెంకట్ రెడ్డి.