యుద్ధకళగా ప్రచారంలోకి వచ్చిన కరాటే వ్యాయామంగాను పనికొస్తుంది
మహిళలు తమ రక్షణ కోసం కరాటే ను నేర్చుకోవాలి
నీలం మధు ముదిరాజ్
సక్సెస్ షోటోకాన్ కరాటే 8 వ రాష్ట్రస్థాయి పోటీలు ప్రారంభం
టీజీఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డితో కలిసి ప్రారంభించిన నీలం మధు
పటాన్‌చెరు, జనవరి 5 సిరి న్యూస్:
స్వీయ ఆత్మరక్షణకు క్రమశిక్షణకు కరాటే విద్య దోహదం చేస్తుందని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ అన్నారు.ఆదివారం సంగారెడ్డి నియోజకవర్గం కంది మండలం ఎద్దుమైలారం గ్రామ పరిధిలోని ఓడిఎఫ్ సారత్ కమ్యూనిటీ హాల్లో నిర్వాహకులు శ్రీనివాస్ మరియు వారి బృందం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 8 వ స్టేట్ లెవెల్ సక్సెస్ షోటోకాన్ కరాటే పోటీలను సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు, టీజీఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డితో కలిసి ప్రారంభించారు. నిర్మలా జగ్గారెడ్డి, నీలం మధు మాట్లాడుతూ యుద్ధకళగా ప్రచారంలోకి వచ్చిన కరాటే వ్యక్తిగత ఆత్మ రక్షణతో పాటు వ్యాయామంగాను పనికొస్తుందన్నారు.
మహిళలు తమ రక్షణ కోసం కరాటే ను నేర్చుకోవాలని వారు సూచించారు. కరాటే శిక్షణ అందిస్తూ ఎంతోమంది కరాటే సాధకులను తయారు చేస్తున్న సక్సెస్ షోటోకన్ కరాటే నిర్వాహకులను నీలం అభినందించారు. భవిష్యత్తులో కరాటే యోధులకు పూర్తిస్థాయిలో తన సహాయ సహకారాలు అందిస్తానని నీలం స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సిడిసి చైర్మన్ గడిల రాంరెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు పులిమామిడి రాజు, తలారి ఈశ్వర్, ex సర్పంచ్ మల్లారెడ్డి,మోకిలా వెంకటేష్, రాజు గౌడ్,బాలు,సతీష్, పాండు,గోపాల్, నిర్వాహకులు, క్రీడాకారులు, తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు.