ముక్కోటి ఏకాదశి ఉత్తరధార దర్శనం
ముస్తాబైన వైష్ణవ దేవాలయం
వేకువజామునుంచే స్వామివారి దర్శనానికి ఏర్పాట్లు
ముస్తాబైన వైష్ణవ దేవాలయం
వేకువజామునుంచే స్వామివారి దర్శనానికి ఏర్పాట్లు
సిరి న్యూస్/ గుమ్మడిదల
ఈ నెల 10 న వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని మండల కేంద్రమైన గుమ్మడిదల లోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం ముస్తాబయింది. ఉత్తర ద్వారం నుండి భక్తులు స్వామివారిని దర్శించుకునేలా ఆలయ వంశపారపర్య ధర్మకర్తలు అన్ని ఏర్పాట్లు చేశారు అధిక సంఖ్యలో భక్తులు వస్తారని ఆలయ కమిటీ చైర్మన్ పడమటి లక్ష్మారెడ్డి భక్తులకు ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పుష్య శుద్ధ ఏకాదశి ముక్కోటి ఏకాదశి అంటారు దీనిని వైకుంఠ ఏకాదశి అని హరివాసరమణి పిలుస్తారు మన పండుగలు అన్ని నక్షత్ర గమనం మీద ఆధారపడి ఉంటాయి ఈరోజు విష్ణు నక్షత్రం పూర్తిగా అంటే తెల్లవారుజామున సూర్యోదయానికి పూర్వమే ఆకాశంలో దర్శనమిస్తుంది ముక్కోటి నాడు వైకుంఠ ద్వారాలను తెరుస్తారని దక్షిణాయన కాలంలో ఇప్పటివరకు చనిపోయిన వారంతా ఇప్పుడు పరమపదంలోకి ప్రవేశిస్తారని భావన అందుకే దీన్ని స్వర్గ ద్వారం అని అంటారు.
ఏర్పాట్లు పూర్తి:
ఈనెల 10న వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం కు వచ్చే భక్తులకు ఇలాంటి ఇబ్బందులు కలగకుండా తగు చర్యలను తీసుకున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ పడమటి లక్ష్మారెడ్డి. వంశపారంపర్య ధర్మకర్తలు నరసింహ చార్యులు తెలిపారు.