జనవరి 15(సిరి న్యూస్):
సంక్రాంతి సంబరాల్లో భాగంగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు జయప్రకాశ్ రెడ్డి సంగారెడ్డిలోని రామ మందిరం దగ్గర పార్టీ కార్యకర్తలతో ఆటపాటల మధ్యన సంబురాలు నిర్వహించారు. పతంగులు ఎగురవేస్తూ అందరిలో జోష్ నింపారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ అప్పట్లో చాలా పతంగులు ఎగురవేసే వాళ్ళమని ఆ జోష్ ఇంకా తగ్గలేదని బాధ్యతలు పెరిగినందున సమయం ,, కేటాయించలేకపోతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా మార్కెట్లోకి వచ్చినటువంటి కొత్త రకం మాంజాల గురించి చైనా మాంజా వాడవద్దని అలాగే రోడ్లపైకి వెళ్లి పతంగులు ఎగుర వేయవద్దని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూన సంతోష్, శ్రీకాంత్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.